కరోనా ఎంట్రీతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇదే సమయంలో వాహనరంగం స్తంభించిపోయింది. ఈ కారణంగాపెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా తగ్గింది. బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రో, డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే భారత్ లో ఇందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం శోచనీయంగా మారింది. గత కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధరలు రూ.60 రూపాయలు ఉంటే ఇప్పుడది ఏకంగా సెంచరీని దాటేసింది.…
2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం ఆవిష్కరణకు.. ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆ సమతా మూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలంటూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని మన్నించారు ప్రధాని మోడీ.దేశం గర్వించే ఈ బృహత్కార్యంలో తాను తప్పక పాల్గొంటానన్నారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో.. భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ప్రధాని! ఈ మహాకార్యం సాకారం చేసిన చిన్నజీయర్ స్వామి సంకల్పాన్ని…
భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 40 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,662 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.. మరో 281 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 33,798 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి…
కరోనా సమయంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఇదే సమయంలో సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, కరోనా విజృంభణ, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలతో సామాన్యుల నుంచి వీవీఐపీలు, సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి.. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.. అందుతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు.. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే నితిన్ గడ్కరీ.. కరోనా సమయంలో తాను…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.. ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది.. అయితే, ప్రస్తుతం కరోనా రోజువారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది.. కానీ, మళ్లీ ముప్పు పొంచేఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం..…
‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు…
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా… పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాల కోసం కొత్త ఛానల్‌ను ప్రారంభించింది కేంద్రం. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభా స్పకీర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ… సంసద్ టీవీని ప్రారంభించారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ పేర్లతో రెండు ఛానల్స్ ఉండేవి. ఆ రెండింటినీ సంసద్ ఛానల్లో విలీనం చేశారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో సంసద్ టీవీ…ముఖ్యమైన చాప్టర్‌గా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృతస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్…
బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో కమలదళం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో మోదీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో మోదీ సర్కారు రెండోసారి సైతం అధికారంలోకి వచ్చింది. అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. జనాల…
అఫ్ఘన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టాలు, హింసకు…