టి 20 మ్యాచ్ లు ఎక్కడ జరగినా క్రీడా ప్రేమికులు అత్యధిక సంఖ్యలో చూస్తుంటారు. ఇక, ఇండియా పాక్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా టీవీ ఛానళ్లలోనూ చూస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాక్ ఇండియాను ఓడించలేదు. ఐదుసార్లు రెండు జట్లు తలపడగా ఐదుసార్లు ఇండియానే విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైన చరిత్రను తిరగరాయాలని పాక్ అనుకుంటోంది. దీనికోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నది.
ఇక ఇదిలా ఉంటే, ఇండియా జట్టు సూపర్ ఫామ్‌లో ఉన్నది. వార్మప్ మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో విజయం సాధించడంతో మానసికంగా స్ట్రాంగ్ అయింది. పైగా ధోనీ మెంటార్‌గా ఉండటం ఇండియా జట్టుకు పెద్ద బలం అని చెప్పుకోవాలి. కాగా, ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ టీఆర్‌పీ రేటింగ్ రికార్డ్ స్థాయిలో ఉండబోతుందని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఇండియా గెలిచి చరిత్రను సుస్థిరం చేసుకుంటుందా లేదంటే పాక్ విజయం సాధించి చరిత్రను సృష్టిస్తుందా చూడాలి.
Read: కొత్త రూల్: సీరియళ్లలో కౌగిలింతలు కట్…