టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ మ్యాచ్ పై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్తో జరగనున్న మ్యాచ్ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని… మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు తమ జట్టు టీమ్ ఇండియాను ఓడించలేదని… కానీ, అది గతం…ఇప్పుడు చరిత్ర తిరగరాయబోతున్నామని స్పష్టం చేశారు. ఇవాళ్టి మ్యాచ్లో విజయం తమదేనని… ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించామని తెలిపారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోకుండా ఉంటారని ఆశిస్తున్నాని… టీమ్ ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నామని ప్రకటించారు. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.