నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్…రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు చేసి మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం.. ఈ హీట్‌ను మరింత పెంచుతుంది.
ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. పైగా ఈ ఇద్దరూ వామప్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో పెద్దగా రాణించని కోహ్లీ.. సెకండ్ వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. పైగా ఇది కెప్టెన్‌గా అతనికి చివరి టీ20 ప్రపంచకప్ కావడం.. మెంటార్‌గా తన బాస్ మహేంద్ర సింగ్ ధోనీ అండ ఉండటంతో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లీకి కావాల్సిన సమయం ఉంటుంది.
Also Read
- Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
కాబట్టి అతను పాత కోహ్లీలా చెలరేగే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కు జరగనుంది కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. దీంతో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే భువీని తీసుకురావాలనుకుంటే మాత్రం షమీని పక్కనపెట్టవచ్చు. ఇక ఏకైక స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని తీసుకునే చాన్స్ ఉంది. అయితే అతని ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడితే మాత్రం తుది జట్టులోకి అశ్విన్ వస్తాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కి డబుల్ దమాకా. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. ఈ సూపర్ సండే రోజున భారత్-పాకిస్తాన్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాయుళ్లు కాచుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ ఎత్తున బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
- Tags
- india
- Pakistan
- T20 World Cup
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!