టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ…
ఇండియాలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04 చేరగా.. లీటర్ డీజిల్…
యాపిల్, గూగుల్, శాంసంగ్ తో పాటు అనేక కంపెనీలు మోబైల్ ఫోన్లతో పాటుగా స్మార్ట్ వాచ్‌లను కూడా విపణిలోకి ప్రవేశపెట్టాయి. స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ ఫోన్లతో అనుసంధానం చేసుకొని వినియోగించుకోవచ్చు. ఫోన్ లలో ఉన్నట్టుగానే స్మార్ట్ వాచ్‌లలో కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాలి. ఇదిలా ఉంటే, హువావే కంపెనీ భారత్ మార్కెట్లోకి కొత్త వాచ్ పిట్ పేరుతో స్మార్ట్ వాచ్‌ని విడుదల చేసింది. ఈ వాచ్ పిట్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. Read:…
హుజురాబాద్, బద్వేల్తో పాటు ఇవాళ దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ…
ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే…
భారత్‌లో దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చినా.. కోవాగ్జిన్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి విదేశీ పర్యటలనపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కోవాగ్జిన్ తీసుకున్నవారికి కూడా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిఇస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం.. డబ్ల్యూహెచ్‌వో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.. అయితే, భారత్ బయోటెక్…
టీం ఇండియాకు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌లు గెలిచేంత మానసిక బలం లేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు తాను ఆడిన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఓడిపోయింది. దాంతో వారు నిన్న ఆడిన రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన తప్పకుండ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్…
ఎలన్ మస్క్ 300 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపదను కలిగియున్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అదే విధంగా మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నది. తక్కువ ధరకే శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్రవేశించింది.…
ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే, చైనా ఇప్పడు కొత్త ఎత్తులు వేస్తున్నది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశంచే నదులను కలుషితం చేస్తున్నది. దీని వలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివశించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల…