టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు టీమిండియా ఖాతా తెరిచింది. బుధవారం రాత్రి అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వరుసగా మూడోసారి భారత కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Read Also: దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్ ముందు భారీ…
దీపావళి పండుగ నేపథ్యంలో దేశ ప్రజల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఇచ్చారు. ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుందని… మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటామని తెలిపారు. భారతీయ సంస్కృతిలోని…
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… బ్యాటింగ్ లో దుమ్ములేపింది. ఆరంభం నుంచి 20 ఓవర్ల వరకు ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆడారు టీమిండియా బ్యాట్స్మెన్లు. దీంతో 20 ఓవర్ల లో కేవలం రెండు వికెట్లు కోల్పోయి… ఏకంగా 210 పరుగులు చేసింది టీమిండియా. కేఎల్…
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్… మొదటి ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి మొదట బ్యాటింగ్ చేయనుంది టీమిండియా. ఇక జట్టు వివరాల్లోకి వెళితే… ఆఫ్ఘనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహమానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(c), కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్…
భారత్‌ను ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు డెంగీ వ్యాధి కలకరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన డెంగీ కేసుల కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. ఈ జాబితాలో కేరళ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. కేంద్రం…
ఇండియా పాక్ మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. గతంలో ఇండియా రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇండియా విమానాలు ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలకు కూడా పాక్ అనుమతులు ఇవ్వలేదు. Read: వైరల్:…
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధర 150కి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్రోల్ ధరలు భరాయించలేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన పబ్లిక్ సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా, కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువతకు బైక్‌లంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో యువత కొత్తగా ఆలోచించి నూతనంగా బండ్లను తయారు చేసుకుంటున్నారు. Read: పాక్ లో 5వేల ఇండియా…
ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మంది తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన అనేక దేశాలు మానవతా దృక్పధంతో ఆహారపదార్ధాలను సరఫరా చేసి ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఇండియా నుంచి పాక్ మీదుగా ఈ గోధుమలను సరఫరా చేసేందుకు 5వేల ట్రక్కులను వినియోగిస్తున్నది. ట్రక్కుల్లో గోధుమలను నింపి పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరవేయాలి. Read:…
మన దేశంలో ఇవాళ కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 311 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 14,159 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,51,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల…
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం…