శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో క్రిప్టో, డిజిటల్ కరెన్సీపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని నిర్ణయిస్తూనే, డిజిటల్ కరెన్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చట్టంలో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈరోజు సభ ప్రారంభమయ్యాక డిజిటల్ కరెన్సీపై ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి.
Read: ఒమిక్రాన్ టెన్షన్: సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది…
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ అనేక కేస్ స్టడీలను చేస్తుందని, దశల వారీగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ప్రకాశ్ చౌదరీ తెలిపారు. డిజిటల్ కరెన్సీ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, నగదు వినియోగం తగ్గిపోతుందని, డిజిటల్ విధానం ద్వారా ఖచ్చితమైన, సమర్థవంతమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.