మన దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…
నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు.…
ఇవాళ న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్ గెలుస్తుందా? భారత్ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్, కివీస్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్ సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్, స్కాట్లాండ్పై…
భారత జట్టు నిన్న ఆడిన విధంగా అన్ని మ్యాచ్ లలో ఆడితే ఎవరు ఓడించి లేరు అని టీం ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నారు. అయితే కోహ్లీ సేన నిన్న స్కాట్లాండ్ పైన భావి ఓజయం సాధించిన విషయం తెలిసిందే. దీని పై జడేజా మాట్లాడుతూ… మా నెట్ రన్-రేట్ పెరగాలంటే మేము పెద్ద తేడాతో గెలవాలని అందరికీ తెలుసు.. అందుకే మేము మైదానంలో మా 100 శాతం అందించాలని చూసాము అని జడేజా అన్నారు.…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 392 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 12,509 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,46,950 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య…
వీగోవీ .. పేరు వెరైటీగా వుంది కదూ.. తీవ్రమయిన బరువుతో ఆపసోపాలు పడేవారికి ఇది దివ్యౌషధం. అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్ షాపులకు పరిగెడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు భారీ డిమాండ్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ నేపథ్యంలో సప్లయ్ సరిగా జరగడం లేదంటున్నారు. వీగోవీకి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి.…
ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది రాజకీయం కాదు తపస్సు.. అందుకే ప్రపంచ దేశాలని మోడీ వైపు చూస్తున్నాయని ప్రశంసలు కురిపించారు గరికపాటి నరసింహారావు. హైదరాబాద్ లోని విద్యానగర్ శంకర్ మఠం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. రాజకీయాన్ని ఒక తపస్సుగా భావించింది భారత జాతి అని.. రాజకీయ తపస్సు ఎట్లా ఉంటుందో ఈనాడు ప్రధాని మోడీ లో చూశామని తెలిపారు. పరిపాలన మరీ సున్నితంగా..మరీ కఠినంగా ఉండకూడదని వెల్లడించారు. రాజకీయం బాగుండాలంటే మంత్రివర్గంలో తీసుకున్న…
క్రిప్టో కరెన్సీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. క్రిప్టో కరెన్సీలో అనేక రకాలు ఉన్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్ఆర్పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి. అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా, ఈ బిట్‌కాయిన్ రంగంలోకి డిజిటల్ పేమెంట్ గేట్‌వే పేటీఎం కూడా ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఇండియాలో ప్రభుత్వం అనుమతులు ఇస్తే క్రిప్టోకరెన్సీ రంగంలోకి ఎంటర్‌కావాలని చూస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సిద్ధం…
భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 221 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు…