దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అన్నదాతల అప్పులకు రాజకీయంగా, ఆర్థికపరంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నాయి. ఏపీలో 93.2 శాతం మంది రైతులు, తెలంగాణలో 91.7 మంది రైతుల కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబితాలో కేరళ(69.9%), కర్ణాటక(67.7%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54శాతం) రాష్ట్రాలు వరుస స్థానాల్లో ఉన్నాయి.
Read Also: బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
కాగా తెలంగాణలో రైతు బంధు పథకం అమలవుతున్నా… ఏపీలో రైతు భరోసా పథకం అమలు చేస్తున్నా.. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఇంకా అప్పుల భారం మోయడం ఏంటని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పంటలకు సరైన మద్దతు ధరలు లేక పంట రుణాలు లభించకపోవడంతోనే అన్నదాతలు అప్పుల ఊబిలోకి దిగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.