ఒమిక్రాన్ వేరియంట్..ఆ వయస్సు వారిపైనే ఎఫెక్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజుకో రూపం మార్చుతూ పెను సవాల్ విసురుతోంది కరోనా వైరస్. ఊహించని రీతిలో వ్యాపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదట్లో వెలుగు చూసిన కరోనా వేరియంట్లు వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లపై ప్రభావం చూపిస్తే… తర్వాత బీటా, డెల్టా వేరియంట్లు యువకులు, మధ్య వయస్కులపై విరుచుకుపడ్డాయి. తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.సౌతాఫ్రికాలో ఐదేళ్ల లోపు చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ప్రస్తుతం తమ ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులే అధికంగా ఉంటున్నారని సౌతాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు.
జహన్నెస్ బర్గ్ నగరాన్ని ఆనుకుని ఉన్న గౌటెంగ్ ప్రావిన్సులో గల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య వారం-వారానికి పెరుగుతున్నారు. అడ్మిట్ అవుతున్న వాళ్లలో అన్ని వయస్సుల వాళ్లు ఉంటున్నా… ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పిల్లలపై కరోనా ప్రభావం స్వల్పంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సౌతాఫ్రికాలో థర్డ్ వేవ్‌లో కూడా ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు 15 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వాళ్లు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కానీ… ఇప్పుడు ఆస్పత్రిపాలువుతున్న వాళ్లలో ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య అధికంగా ఉందంటున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ నడుస్తోంది. ఉదాహరణకు తాష్వాని నగరంలో ఫోర్త్ వేవ్ మొదటి రెండు వారాలైన నవంబర్ 14 నుంచి 27 వరకూ వంద మందికి పైగా పిల్లలు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు మేలో వచ్చిన థార్డ్ వేవ్ సమయంలో ఆస్పత్రి పాలైన చిన్నారుల సంఖ్య 20 కూడా దాటలేదు. అయితే, దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. పెద్ద వాళ్లకు వ్యాక్సినేషన్ వల్ల రోగనిరోధక శక్తి వస్తోంది. కానీ పిల్లలకు ఇంకా కరోనా వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్లు వైరస్ బారినపడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా… ఇతర కరోనా వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్ పసివాళ్లకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!