దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా డెల్టా వేరియంట్ డామినేట్ చేస్తున్నది. గత కొన్ని రోజులుగా దేశంలో కేసులు పెరుగుతుండటంతో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు దేశంలో థర్డ్ వేవ్‌పై పరిశోధన చేశారు. థర్డ్ వేవ్ ఫిబ్రవరి 3 వరకు పీక్స్ స్టేజీకి వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read: కరోనా ఎఫెక్ట్: ఆ దేశాల్లో వారంలో నాలుగురోజులే పని…
ఒమిక్రాన్ కేసుల ప్రభావం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంచనా వేశారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, రష్యా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులును దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొనవచ్చో కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ డేటాను ఈ పరిశోథన కోసం తీసుకోలేదని ఐఐటీ కాన్పూర్ తెలియజేసింది.