మనిషి ఆయుప్రమాణం 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి జీవించేందుకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరణించే సమయంలో కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తిని మరణిస్తున్నారు. జీవించడం ఎంత ముఖ్యమో, మరణించే సమయంతో ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. అమెరికాకు చెందని డ్యూక్ యూనివర్శిటీ క్వాలిటీ ఆప్ డెత్ అండ్ డైయింగ్ 2021 పేరిట పరిశోధనలు చేసి నివేదికను తయారు చేసింది. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో మాత్రమే ప్రజలు సుఖవంతమైన మరణం పొందుతున్నారని, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో అది కలగానే మిగిలిపోతుందని యూనివర్శిటీ సర్వేలో తేలింది. ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఆధారంగా81 దేశాలలో పరిశోధనలు చేసి ఏ,బీ, సీ,డీ,ఈ,ఎఫ్ గ్రూపులుగా విభజించారు.
Read: వూహన్ శాస్త్రవేత్తల హెచ్చరిక: బయపెడుతున్న మరో కొత్త నియోకోవ్ వైరస్…
ప్రశాంతమైన మరణాలు కేవలం 6 దేశాల్లో మాత్రమే ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది. భారత్, చైనా, రష్యా, గ్రీస్, చిలీ, జార్జియా, వియాత్నం, మెక్సికో దేశాలు గ్రూప్ డీలో స్థానం సంపాదించాయి. ఇక, అమెరికా, కొలంబియా, థాయ్‌లాండ్, ఈజిప్ట్, ఘనా, ఉగాండా, డెన్మార్క్, నైజీరియా దేశాలు గ్రూస్ సీలో స్థానం సంపాదించాయి. యూకే, ఐర్లాండ్, తైవాన్, కోస్టారికా, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా దేశాలు గ్రూప్ ఏ లో స్థానం సంపాదించాయి. గ్రూప్ ఎఫ్‌లో మొత్తం 21 దేశాలు ఉండటం విశేషం. ఈ విషయంలో భారత్ 59 వ స్థానంలో నిలవగా, అమెరికా 43వ స్థానంలో నిలిచింది.