దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డ్ సాధించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ ప్రకటించిన టాప్ 500 కంపెనీల్లో టాటా కన్సల్టెన్నీ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,78,357 మంది ఉన్నారు. మొత్తం టీసీఎస్ ఉద్యోగుల్లో 35 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. Read: ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ క్లారిటీ… పదేళ్ల కిందట…
మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
రక్షణ రంగంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా రాణిస్తున్నారు. బోర్డర్లో పహారా కాస్తున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో అత్యధిక రిస్క్ ఎదుర్కొంటున్న వ్యక్తుల రక్షణ కోసం మహిళా కమాండోలను నియమించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు మహిళా కమాండోలు రక్షణగా ఉండబోతున్నారు. ఈ ముగ్గురికి మహిళా కమాండోలను ఏర్పాటు చేయబోతున్నట్టు రక్షణశాఖ స్పష్టం చేసింది. 32 మంది…
36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్సెట్ బాధ్యతలను ఆలస్యం చేసినందుకు గాను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం జరిమానా విధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూరో 7.8 బిలియన్ల ఒప్పందంలో ఆఫ్సెట్ హామీలను నెరవేర్చడంలో జాప్యం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఫ్రెంచ్-భారత ప్రభుత్వాలు సెప్టెంబరు 2016లో యూరో 7.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ విలువలో 50…
భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు…
దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు కుల రాజకీయాలలో బిజీగా ఉన్నాయి. కుల ప్రాతిపదిక ఏర్పడిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నాయి. వాటితో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో మహిళా ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. గత కొన్ని నెలల నుంచి మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు,…
రష్యానుంచి ఎస్ 400 ట్యాంకులను భారత్ దిగుమతి చేసుకున్నది. మూడేళ్ల క్రితమే రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. అన్ని ఆటంకాలను దాటుకొని మొదటి బ్యాచ్ ఎస్ 400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి. ఎస్ 400 ట్రయాంఫ్ గగనతల రక్షణశ్రేణి వ్యవస్థను తొలి స్వాడ్రన్‌ను పంజాబ్ సెక్టార్లో మోహరిస్తున్నారు. పాక్, చైనా దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధీటుగా వీటిని పంజాబ్ సెక్టార్లో మోహరిస్తున్నారు. Read: వచ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు……