ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనం అవసరమే లేదు.. నచ్చిన రైడ్ యాప్‌ను మొబైల్లో డౌలేడ్ చేసుకుని.. బైక్, ఆటో, కారు.. ఇలా ఏది బుక్ చేసుకున్నా.. మీరు ఉన్నచోటికే వచ్చి పికప్ చేసుకుని.. గమ్యస్థానానికి చేర్చుతున్నాయి.. క్రమంగా.. ఉబెర్, ఓలా, రాపిడో.. వంటి యాప్స్ తెగ వాడేస్తూ.. గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.. ఇది ముఖ్యంగా సిటీలో ఎక్కువగా జరుగుతోంది.. అయితే, ఈ యాప్స్ ఎక్కువగా వాడుతుంటే మాత్రం.. ఇప్పటికే మీ సమాచారం మొత్తం వారి గుప్పిట్లో ఉన్నట్టే..…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. తాజా గణాంకాల ప్రకారం కూడా ఒమిక్రాన్ బారినపడి పరిస్థితి సీరియస్‌గా అయినవారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.. అంటే.. వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ఏ స్థాయిలో పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, కోవిడ్‌పై పోరాటంలో భాగంగా.. మొదట దేశీయంగా తయారైన రెండో వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రభుత్వమే కొని వాటిని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, సంస్థలకు…
ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే…
73 వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తనకు మెస్సేజ్ పంపించినట్టు తెలిపాడు. ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెస్సేజ్ చూసి నిద్ర లేచాను. Read Also: పుజారా, రహానెలకు షాక్… కాంట్రాక్ట్…
భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…
భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.…
దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టు బడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఇక్కడి చట్టాల కారణంగా ఆ కంపెనీ వెనకడుగు వేస్తున్నది. ఇక దేశీయ వ్యాపర దిగ్గజం మహీంద్రా కంపెనీ అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టింది. కార్ల ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు ఆనంద్ మహీంద్రా.…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పటికే మోపెడ్, స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్లు, హై స్పీడ్ స్కూటర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 50,190 కేసులు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో 614 మంది కరోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక దేశంలో ప్రస్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్నది. కరోనా కేసులు పెరుగుతున్నా గతంలో మాదిరిగా పెద్దగా తీవ్రత…
గతేడాది సీజన్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో…