ఇవాళ నరాలు తెగే ఉత్కంఠ.. క్రికెట్ ప్రేమికులకు తప్పేలా లేదు. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ జరగనుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇక్కడ మ్యాచ్ జరగనుంది. మూడు సంవత్సరాలు తర్వాత జరుగుతున్న ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే నాగపూర్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. 300 సీసీ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. గ్రౌండ్లో కూర్చున్న ప్రతి వ్యక్తిని గుర్తించేలా ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటుచేశారు. మొబైల్ మినహా ఎలక్ట్రానిక్ గూడ్స్ కి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అక్టోపస్ బలగాలు రెండు గ్రూపులు ,షార్ట్ షూటర్స్ మరో రెండు గ్రూపులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
35వేల నుండి 38 వేల వరకు అభిమానులు వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే 21 పార్కింగ్ ప్లేస్ లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మూడు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుండి మధ్యరాత్రి ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఐదు మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేశారు. క్రికెట్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా హాట్ టాపిక్ అవుతోంది.