Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి.
పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీయే.. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. కుదిరితే ఏదైనా హోటల్‌కు వెళ్లి ఇష్టమైన బిర్యానీ లాగించాలి.. లేదా ఆర్డర్ పెట్టి తినేయాలి.. అయితే, బిర్యానీ లాగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. భారతీయులు ఈ ఏడాది బిర్యానీని భారీ స్థాయిలో ఆరగించేశారు. 2022 ఏడాదిలో కేవలం స్విగ్గీ ద్వారా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.. గత ఏడాదితో పోలిస్తే.. ఇది ఎక్కువ..…
5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఎంతో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో…
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్‌గా మారింది.
US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు.…