Economic Forum: దావోస్ వేదికగా ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్.. పాల్గొననున్న మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Economic Forum Summit: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ థీమ్ ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’ అని నిర్ణయించారు.
ఈ సమ్మిట్‌లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, ప్రపంచ ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు వంటి కొన్ని ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. ఈ సమ్మిట్ వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించనున్నారు. ఈ సమ్మిట్‌కు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం రామఫోసా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలు పాల్గొననున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..
భారత్ నుంచి కూడా పలువురు నేతలు ఈ సమ్మిట్‌లో భాగస్వామ్యం కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియా, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్ హాజరుకానుండగా.. ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బిఎస్ బొమ్మై, యోగి ఆదిత్యనాథ్ సభకు హాజరవుతారని సమాచారం. వీరే కాకుండా టాటా సన్స్ ఇండియా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొననున్నారు. బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!