India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకెళ్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల దిగుమతిలో 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం 2018 నుండి 2022 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా తర్వాతి స్థానంలో ఉంది.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్న్యూస్ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసులో భారత్తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు మార్గం సుగమం చేసింది.