S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నాలుగు నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 విజయం సాధించిన తర్వాత, భారత్- ఆస్ట్రేలియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచుల ODI సిరీస్పై దృష్టి సారించింది. రోహిత్ శర్మ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో జట్టును నడిపించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలామంది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి.
టెస్టు సిరీస్ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పైనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.