ఏ1 గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే.. ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన తెలుగు, హిందీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నిన్న అర్థరాత్రి సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. దీనిపై ఈ రోజు వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ కేసులో A1గా ఎంపీ బండి సంజయ్ ఉన్నారని, A2 గా ప్రశాంత్ ఉన్నాడన్నారు. A3 మహేష్, A5 శివ కుమార్‌లను రిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. బురా ప్రశాంత్ అరెస్ట్ చేశామని, వైర్సల్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బురా ప్రశాంత్.. బయటకు వచ్చిన పేపర్స్.. హైదరాబాద్ లోని మీడియా హెడ్ కి పంపినాడు.. బండి సంజయ్ కి పెట్టాడు.. కుట్ర కేసు పెడుతారా అంటే పెట్టాము.. మహేష్. కూడా చాలా మందికి పంపినాడు.. ఈటల రాజేందర్ కూడా పంపినా.. వారిని ముద్దాయిగా పెట్టడం లేదు.. మొన్న 3న బండి సంజయ్‌కి మళ్ళీ చాటింగ్ జరిగింది. ప్రశాంత్ ఏది అయితే అది బండి సంజయ్ మధ్య చాటింది జరిగాయి.. కాల్ డేటా తిశాము.. బండి సంజయ్ ఫోన్ లేదు అని చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాము. ఆ ఫోన్ లో మరింత సమాచారం ఉంటుంది. కమలాపూర్ నుండి ఎందుకు బయటకు వస్తుంది.
కనుల పండువగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం

జగదానంద కారకుడు.. జానకీ ప్రాణవల్లభుడు.. శ్రీరాముడు పెళ్ళి కొడుకయ్యాడు.. సీతాదేవి మెడలో మూడుముళ్ళ వేశాడు.. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. పున్నమి వెలుగుల్లో శ్రీసీతారాముల కల్యాణం చూడడానికి భక్తులు పోటెత్తారు. ఒంటిమిట్ట కళ్యాణానికి హాజరయ్యారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, దేవాదాయమంత్రి సత్యనారాయణ. .కోదండ రాముణ్ణి దర్శించుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎ.అమర్నాథ్ రెడ్డి. సీఎం జగన్ రాలేకపోవడంతో.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి…టిటిడి తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశమంతా సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి రోజు జరుగుతుంది. అయితే, ఒంటి మిట్టలో మాత్రం చైత్ర పొర్ణమి పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రుని కోరిక మేరకు పగటి వేల కళ్యాణం తాను చూడలేనన్న కోరిక తీర్చేందుకు పండు వెన్నెల్లో కళ్యాణం రాముల వారి వరంతో ఈ వేడుక ప్రత్యేకంగా జరుగుతుంటుంది. మరో కథనం మేరకు చంద్ర వంశ రాజులైన విజయనగర రాజులు తమ కుల దైవ మైన చంద్రుణ్ణి ఆరాధిస్తూ రాత్రి పూట కల్యాణాన్ని జరిపించే ఆచారం ఉంది. తెలుగు దనంతో ఉట్టి పడింది రాముల వారి కళ్యాణ వేదిక..వరి కంకులు, ఫల పుష్పాలతో అత్యంత శోభాయమానంగా వేదిక రెడీ చేశారు. దేశ విదేశాలనుంచి తెప్పించిన నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఫలాలతో అలంకరణ చేశారు. శాశ్వత కళ్యాణవేదిక ప్రాంగణాన్ని చెరుకు గడలు, టెంకాయ గెలలు, పూట, అరటి ఆకులు, మామిడి ఆకులు, వివిధ ఫలాలతో ఆధ్యాత్మిక అలంకరణ ఉట్టిపడేలా అలంకరణలు చేశారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రాష్ట్రవిభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అత్యాధునిక లైటింగ్ సిస్టమ్.. శోభాయమానంగా శాశ్వత కళ్యాణ వేదిక అలరారింది.
ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక
ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక అందచేశారు. సీతమ్మకు బంగారు పతకం.రామయ్యకు కౌస్తుభం బహూకరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు అందాయి. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది. ఈ శుభ సందర్బంగా 360 గ్రాముల బరువు గల బంగారు పతకం, కౌస్తుభం ఆభరణాలను కానుకగా అందించారు.టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు. ఆలయం ముందు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
దేశానికే రోల్ మోడల్ గా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉండనుంది. అందరికీ మంచి ఆధునిక వైద్యం, అదీ ఉచితంగా, అందరికీ తాము ఉంటున్న ఊర్లోనే అందించే కార్యక్రమం, మంచానికే పరిమితమైన రోగులకు సైతం వారి గ్రామంలోనే, వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేయాలన్న తపనతో ఫ్యామిలీ డాక్టర్ విధానానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్.ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంతో అనుసంధానం, ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టర్ ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. వైద్యుడు తనకు కేటాయించిన అదే గ్రామాన్ని నెలలో కనీసం రెండు సార్లు సందర్శించి వైద్యసేవలు అందిస్తారు. ఒక వైద్యుడు పలుమార్లు అదే గ్రామంలో ఉన్న అదే పేషెంట్‌ను సందర్శించడం ద్వారా ఆ పేషెంట్‌కు డాక్టర్‌కు మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఆ డాక్టర్‌కు ఆ పేషెంట్ హెల్త్ ప్రొఫైల్ మీద పూర్తి అవగాహన ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుంది. వైద్యునికి ఆ గ్రామంపై పూర్తి అవగాహన, ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తినీ పేరు పేరునా గుర్తించే అవకాశం ఉంటుంది.
నిత్య పెళ్ళికొడుకు అరెస్ట్..30 మందిని మోసం చేశాడు

అతడు చూడ్డానికి చాలా అమాయకుడిగా, బుద్ధిమంతుడిలాగా కనిపిస్తాడు. అందరితోనూ మంచిగా ప్రవర్తిస్తాడు. మరీ ముఖ్యంగా.. మహిళల పట్ల గౌరవంగా ఉంటాడు. ఇది చూసే మహిళలు అతని బుట్టలో పడేవాళ్లు. తన ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వడంతో.. మంచితనాన్ని అస్త్రంగా మార్చుకొని 30 మంది మహిళల్ని తన వలలో వేసుకున్నాడు. అందునా.. రెండో పెళ్లి చేసుకునే వారినే టార్గెట్ చేసేవాడు. ఎమోషనల్‌గా వారికి దగ్గరై, పెళ్లి పేరుతో మహిళల్ని మోసం చేశాడు. చివరికి.. ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో, ఆ నిత్యకొడుకు బండారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..గుంటూరు చెందిన సుదర్శన్ రావు అనే వ్యక్తి, కొంతకాలం క్రితం షాదీ డాట్ కామ్ ద్వారా ఒక మహిళను కలిశాడు. ఆమె అప్పటికే పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకుంది. తోడు కోసం వెతుకుతున్న క్రమంలో.. షాదీ డాట్ కామ్‌లో సుదర్శన్ రావు పరిచయం అయ్యాడు. తాను ఆర్మీ కమాండర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. తనకు చాలా ఆస్తులున్నాయని, రెండో పెళ్లి అయినా చేసుకోవడానికి సిద్ధమేనని ఆ మహిళను నమ్మించాడు. పాపం.. అప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్న ఆమె, అతడ్ని పూర్తిగా నమ్మింది. తనకు సరైన తోడు దొరికాడని ఆనందించింది. కానీ, ఇంతలోనే అతని నిజస్వరూపం తెలిసి ఒక్కసారిగా ఖంగుతింది. పెళ్లి పేరుతో తనని మోసం చేస్తున్నాడని గ్రహించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏప్రిల్ 11న సెల్ డౌన్.. అమరావతి జేఏసీ యాక్షన్ ప్లాన్

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది అమరావతి JAC..ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు కార్యాచరణ విడుదల అయింది. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణలో ఉన్నాము. కారుణ్య నియామకాలు జరగాల్సిన ఉన్న కుటుంబా లను పరామర్శ చేస్తాం.
ఈ నెల 11న సెల్ డౌన్ ఆందోళన ఉంటుందన్నారు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మంత్రి వర్గ ఉప సంఘం లో మంత్రులు వాళ్లు చెప్పాల్సిన రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయారు.ఉద్యమం కొనసాగిస్తామని మంత్రి వర్గ ఉపసంఘం భేటీ తర్వాత కూడా చెప్పాం.PRC ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 8 ఏళ్లుగా ఉద్యోగుల హెల్త్ ను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేకపోవటం వల్ల వైద్యం నిరాకరణ చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏవీ ఇప్పటి వరకు పరిష్కారం అవలేదు. ఒకటో తేదీన జీతాలు పడితే చాలు అనే పరిస్థితికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు.జీతాలు సక్రమంగా చెల్లింపులు జరపలేక పోవటం ఎవరి విఫలమో చెప్పాలన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రికమెండ్ చేసిన పే సేల్స్ ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం చెప్పాలి.2015 పాత పే స్కేల్ మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ డిమాండ్ల సాధనకు రెండో దశ కార్యచరణ ప్రకటించింది అమరావతి జెఎసి.ఈనెల 5 వ తేది నుంచి 29 తేది వ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకానున్నారు.
బండి సంజయ్ ఎంపీ సభ్యత్వం కూడా రద్దుచేయాలి

పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఖచ్చితంగా బీజేపీ బండి సంజయ్ కుట్ర అని ఆరోపించారు ఎమ్మెల్యే జోగురామన్న. ఆయన ఇవాళ ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని, పార్టీ కార్యకర్తనా కాదా, సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని, చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని జోగు రామన్న సవాల్ చేశారు. పేపర్ లీక్ అయిన రెండు గంటల్లో 140 సార్లు బీజేపీ నేతలకు ప్రశాంత్ ఫోన్ చేశారన్నది సాక్షాలతో సహా రుజువవుతోందని ఆయన అన్నారు. కేంద్రం ఆడిస్తున్న ఆటలను ఇక్కడ నేతలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్… ఎక్కడ ఉందో తెలుసా?

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది. దేశంలో ఐఫోన్‌ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోరీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బుధవారం తన స్టోర్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటి స్టోర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఉంటుంది. ముకేశ్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. ఇక, యాపిల్ ఢిల్లీలో రెండవ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ల కోసం దేశంలో పెరుగుతున్న మార్కెట్‌పై కంపెనీ ఆసక్తిని గుర్తించడమే కాకుండా ఆపిల్ వినియోగదారులకు మెరుగైన సేవలకు హామీ ఇస్తుంది. ఈ దుకాణాలు కేవలం ఉత్పత్తులను విక్రయించడానికి మాత్రమే కాకుండా Apple ఈవెంట్‌లను హోస్ట్ చేయడానికి కూడా నిర్మించబడ్డాయి.
జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..

టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లో జీవిత, రాజశేఖర్ ఖచ్చితంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాజశేఖర్ లేకుండా జీవితను.. జీవిత లేకుండా రాజశేఖర్ ను చూడడమనేది చాలా రేర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి ఈ జంట బ్రాండ్ అంబాసిడర్. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి అందరికి తెల్సిందే. తలంబ్రాలు సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ జంట మరోసారి తమ లవ్ స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక చిట్ చాట్ షోకు జంటగా వచ్చిన వీరు.. వారి లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులను బయటపెట్టారు. జీవితను మొదటిసారి చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి.. తీసెయ్యండి అని చెప్పినట్లు రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ తరువాత అదే సినిమాలో తనను తీసేసి మరో హీరోతో చేశారని చెప్పాడు. ఇక మూడు సినిమాలు కలిసి చేశాక ఒకసారి రాజశేఖర్ తనవద్దకు వచ్చి.. నాకు ఎక్కడో మీరు నా మీద ఆసక్తి చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది అని చెప్పాడు. ఆ ఫ్రాంక్ నెస్ ఆయనలో నాకు బాగా నచ్చిందని జీవిత చెప్పుకొచ్చింది.