Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న భారతదేశం బుధవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారులు (NSA), ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించనుంది.
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.
Indo-Russian mega meet: ఇండియా, రష్యా దేశాల మెగా బిజినెస్ మీటింగ్ ఈ నెల 29, 30 తేదీల్లో జరగనుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. "అభివృద్ధి మరియు పెరుగుదల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం" అనే కాన్సెప్ట్‌తో ఈ భేటీ జరగబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఈ సంవత్సరం 50 బిలియన్ డాలర్లకు చేర్చటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.