2023లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ను చూసే అవకాశం స్వదేశంలో క్రికెట్ అభిమానులకు లేనట్టేనా.. ప్రస్తుతం ఈ ప్రశ్న క్రికెట్ అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంది.
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
‘నాటు నాటు’ ఫీవర్ కొనసాగుతోంది. G20 ప్రెసిడెన్సీలో అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ రెండవ అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ADM) సందర్భంగా G20 ప్రతినిధులు ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ పాటకు నృత్యం చేశారు.
వన్డే వరల్డ్కప్ అనేది మెగా టోర్నీ.. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదని ఐసీసీ వెల్లడించింది.
రాహుల్ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది.
Meta Verified Blue Tick: సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ .. భారత్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్లకు, డెస్క్టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్…
పాకిస్తాన్కు భారత్లో బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా భారత్లో నిలిపివేయబడింది. దీనికి గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో 30వ తేదీ గురువారం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్లో బ్లాక్ చేసింది.
Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ…