దేశంలో కరోనా కేసులు ఊరటనిచ్చాయి. మొన్నటి వరకు 10 వేలపైనే నమోదయిన కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో 6,660 కొత్త కరోనా వైరస్ నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 63,380కి తగ్గాయి. కొవిడ్ మహమ్మారికి గత 24 గంటల్లో మొత్తం 24 మరణాలు నమోదయ్యాయి. పంజాబ్‌లో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఇద్దరు, బీహార్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కేరళలో తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 5,31,369కి పెరిగింది.
Also Read:Yogi Adityanath: యూపీ సీఎంని చంపుతానంటూ బెదిరింపులు
రోజువారీ పాజిటివిటీ రేటు 3.52 శాతంగా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లుగా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43, 11,078కి పెరిగింది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.
కాగా, ఏప్రిల్ 24 న, భారతదేశంలో 7,178 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, అంతకు ముందు రోజు 10,112 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 22న దేశంలో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.