SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ…
Anti-Hindu hate: బ్రిటన్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్ష మరియు బెదిరింపుల గురంచి లండన్ కు చెందిన హేడ్రీ జాక్సన్ సొసైటీ సర్వే నిర్వహించింది. నివేదిక 988 మంది హిందూ తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 51 శాతం మంది తమ పిల్లలు స్కూల్లలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని, వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
Netflix: ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా కొనసాగుతోంది.. ప్రజల నుంచి మంచి ఆధరణ కూడా ఉండడంతో.. అవి చార్జీలను కూడా పెంచుతూ పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఈ తరుణంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలలో సబ్స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.. అంటే, గతంలో నెలకు నెట్‌ఫ్లిక్స్ రూ.199 వసూలు చేస్తూ వస్తుంది.. ఇది నెట్‌ఫ్లిక్స్ మొబైల్-ఓన్లీ ప్లాన్ కాగా..…
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. దేశ జనాభాలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.