భారత్, చైనా మధ్య సరిహద్దులో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు భారీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ( LAC) వరకు భారీ పరికరాలను రవాణా చేయగల రోడ్డు, రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Pakistan fears India may conduct another surgical strike: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 5 మంది సిబ్బంది వీరమరణం పొందారు.
Pakistan: ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ పై యుద్ధం చేయలేదన్న విషయం అందరికి తెలిసు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా అంగీకరించినట్లు పాకిస్తాన్ సుప్రసిద్ధ జర్నలిస్టు హమీద్ మీర్ చెప్పారు. పాకిస్తాన్ వద్ద ఆర్మీ వాహనాలు ఉన్నాయి కానీ అందులో పోసే ఇంధనం లేదని,
India Was World's 4th Largest Defence Spender In 2022: ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2021తో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం 6 శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక తెలిపింది.
Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ…
అనారోగ్యంతో కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
CM YS Jagan: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు…
హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది. కర్ణాటకలో క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక తబస్సుమ్ టాపర్…