రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది.
భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది.
గూగ్ల్ ప్లే స్టోర్లో కుప్పలుకుప్పలుగా యాప్స్ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్.. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్…
బ్యాంకు కస్టమర్లకు గమనిక. ఈ రోజు 5వ శనివారం. ఈ రోజు బ్యాంకులు పని చేస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాలి. ఆదివారాలు, పండుగలు, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, జాతీయ సెలవు దినాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు."రేడియో, ఎఫ్ఎం విషయానికి వస్తే, దానితో నాకు ఉన్న సంబంధం ఉద్వేగభరితమైన శ్రోతతో పాటు హోస్ట్గా ఉంటుంది" అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం త్వరలో రాయితీ సుంకంపై యుఎఇ నుండి 1400 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ దిగుమతులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం జరుగుతాయి. వాణిజ్య పరిభాషలో టారిఫ్ రేట్ కోటా (TRQ) అని పిలువబడే కోటా విధానం ద్వారా 140 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం కొత్త విండోను తెరుస్తుంది.
భారతదేశంలో బలమైన ఉనికిని పెంపొందిస్తూ ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స గురువారం రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మ్యూనిచ్ నుండి బెంగళూరు, ఫ్రాంక్ఫర్ట్ నుండి హైదరాబాద్కు రెండు కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు లుఫ్తాన్స ప్రకటించింది.
India at UN: ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ముఖ్యంగా ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వ హోదా, వీటో అధికారం ఉండటంపై గళమెత్తుతోంది. కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేవని చెబుతోంది. భారత్ వాదనకు ఇతర ప్రపంచదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. భద్రతా మండలిని సంస్కరించాలని పలుమార్లు భారత్ యూఎన్ ను కోరింది.
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధర మరోసారి పెంచేసి యూజర్లకు షాకిచ్చింది.. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది. త్రైమాసిక ప్లాన్ను కూడా సవరించింది.
దేశంలో కరోనా మహమ్మారికి బ్రేక్ పడడం లేదు. గడచిన నెల రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు, యాక్టివ్ కేసులు కూడా ఆదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 9,355 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.