India Tour: పాకిస్థాన్ కు చెందిన వ్లాగర్ అబ్రార్ హసన్ తన బైక్‌లో ఇండియా మొత్తాన్ని చుట్టివచ్చాడు. తన టూర్ 30 రోజుల్లో 7,000 కి.మీ కలియతిరిగాడు. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇండియాలో తనను అపారమైన ఆప్యాయతతో స్వీకరించినట్లు హసన్ తెలిపాడు. తన బైక్ పై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబై, కేరళ మరియు మరిన్ని నగరాల్లో తిరిగినట్టు తెలిపాడు. అంతేకాకుండా అక్కడికి సంబంధించిన వీడియోలను.. తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.
Read Also: Tata: టాటా కంపెనీ సీఈఓల వార్షిక వేతనం ఎంతో తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..
ఇండియాలో వ్లాగర్ హసన్ కు చాలా మంది ఆతిధ్యం ఇచ్చినట్లు తెలిపాడు. అతను ఏప్రిల్ 3న తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపాడు. ఐతే ఇండియాకు వద్దామనుకుంటే “ఇన్నేళ్లుగా వీసా దొరకలేదని.. అందుకోసం బైక్ పై వచ్చినట్లుగా తెలిపాడు. హసన్ కేరళలో పర్యటన వివరాల గురించి చెబుతూ.., కేరళను దేవుని స్వంత దేశం అని పిలవడానికి గల కారణాన్ని గురించి తెలిపాడు. “కేరళను దేవుని స్వంత దేశం అని పిలవడానికి ఒక కారణం ఉందని.. కేరళలోని బ్యాక్ వాటర్స్ బహుశా కేరళలోని అనేక అద్భుతమైన ప్రదేశాలలో ఒకటిగా అభివర్ణించాడు.
హసన్ రాజస్థాన్ పర్యటన గురించి తన అనుభవాలను తెలిపాడు. “రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమని.. ఇది ఆకర్షణీయమైన సంస్కృతికి నిలయమని కొనియాడాడు. అక్కడ కొన్ని అందమైన కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, మసీదులన సందర్శించినట్లు తెలిపాడు. “భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలను చూసినట్లు వ్లాగర్ హసన్ పేర్కొన్నాడు. అయితే ఇండియాలో హాసన్ పర్యటన ఫోటోలు, వీడియోలపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. “అబ్రార్ భాయ్ ఇండియాను ఇంత అందంగా చూపించినందుకు చాలా కృతజ్ఞతలు.. మీరు గేట్ దాటుతున్నప్పుడు కొంచెం భావోద్వేగానికి గురైనట్లు మరొకరు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వ్లాగర్ ఇండియాలో పర్యటించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.