Team India Schedule for ICC World Cup 2023 Warm Up Matches: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. చెన్నైలో…
దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు…
Srilanka: చైనాతో తమకు ఎలాంటి సైనిక ఒప్పందాలు లేవని శ్రీలంక తటస్థంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేఖంగా ఎప్పటికీ వాడుకోనివ్వం అని ఆయన స్పష్టం చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బక్రీద్ పండుగ దగ్గరకు రానే వచ్చింది. ఇస్లామిక్ మతం రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ సన్నాహాల్లో ఉత్సాహంగా, బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అధా అనేది త్యాగం యొక్క పండుగ.
గత 48 గంటల్లో బంగారం ధర రూ.58,400 నుంచి రూ.58,300కి తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం విపరీతంగా పెరిగింది. దీనికి కారణం అమెరికా యొక్క PMI గణాంకాలు మరియు రష్యాలో పెరుగుతున్న అస్థిరత అని అంటున్నారు. అయితే ఈ రెండు దేశాలు వెండి ధరను పెంచేంత పెద్దవి కావు. మరోవైపు మెక్సికో మరియు పెరూ వంటి దేశాల నుండి వచ్చిన నివేదికలు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్నంటేలా ఉన్నాయి.
ఈ మెగా ఈవెంట్ లో చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ టీమ్స్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోనున్నాయి. అదే రోజు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం పుట్టిన రోజు కావడం విశేషం.
పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. గడచిన మూడు నెలల్లోనే దుండగులు నలుగురు సిక్కులను కాల్చి చంపారు.
KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేయబడినప్పటి నుండి భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయింది. అయితే మరోసారి దేశంలోని గనుల నుండి బంగారం బయటపడబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ మైనింగ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి) పూర్తి సన్నాహాలు చేసింది. గనుల నుండి బంగారాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ సంస్థ సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. NMDC ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిగరగుంట-బిసనాథం గోల్డ్ బ్లాక్‌ను లీజుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్నట్లు మరియు బాదం పప్పులు ఉన్నాయి.