భారత్ ఇప్పుడిప్పుడే వివిధ వ్యాపార రంగాల్లో చైనాకు సవాల్ విసురుతోంది. మొదట స్మార్ట్ఫోన్ల విషయంలో యాపిల్ వంటి కంపెనీ భారతదేశానికి రావడం.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సెమీకండక్టర్ తయారీకి మిర్కాన్ అంగీకరించడం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశానికి రావడానికి అంగీకరించారు. ఈ విధంగా చైనా వ్యాపారాన్ని భారతదేశం సెలెక్టివ్‌గా సవాలు చేస్తోంది. ఇప్పుడు చైనా భారత్చే 'లాండరింగ్'గా భావిస్తున్న మరో రంగం కూడా…
ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఎప్పుడో చేస్తారో కూడా ఈ ఆన్ లైన్ సంస్థలు చెబుతాయి. ఇంకా.. ఆన్ లైన్ ట్రాకింగ్ లాంటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతమైతే ఈ-కామర్స్ సంస్థలు దాదాపు వారం, పది రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే.. విచిత్రంగా ఓ వ్యక్తి ఓ వస్తువును ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు ఓ ఈ కామర్స్ సంస్థ డెలివరీ చేసింది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో తీసుకెళ్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్ లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా…
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన…
ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారతదేశంలో సమోసా అంటే చాలా ఫేమస్. సాయంత్రం పూట స్నాక్స్ బ్రేక్ లో ఎక్కువగా తినే ఫుడ్.. దాదాపు సమోస అంటే అందరికి ఇష్టమే. అయితే అది మొట్టమొదటగా ఎక్కడ తయారైంది?. ఇండియాకు ఎలా వచ్చింది.? ఈ రుచికరమైన వంటకం చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.? ఇండియాలో సమోసాలు అంటే లొట్టలేసుకుని తింటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే టీ షాపు, బేకరీ షాపులలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండియాలో సమోసాలను ఎక్కువగా స్వీట్-గ్రీన్ చట్నీతో కానీ..…
భారత బౌలర్ నవదీప్ సైనీ వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు తనను సెలెక్ట్ చేయడంపై షైనీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే కౌంటీ క్రికెట్ ఆడేందుకు నవదీప్ సైనీ ఇంగ్లండ్ చేరుకోగా.. అతను వోర్సెస్టర్షైర్ తరపున కౌంటీ ఆడనున్నాడు.