Upcoming Smartphones in August 2023 Under Rs 20000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. 2023 ఆగస్టులో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్‌సంగ్, రెడ్‌మీ, మోటొరోలా, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ బట్టి స్మార్ట్‌ఫోన్‌లను కొనేసుకోవచ్చు. ఆగస్టులో రిలీజ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఓసారి చూద్దాం.
Motorola G14:
G-సిరీస్ లైనప్‌లో మోటొరోలా కంపెనీ వరుసగా బెస్ట్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టులో మోటొరోటా G14 రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ. 15వేలలోపే ఉండే అవకాశం ఉంది. బెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చే ఈ మోడల్.. కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ ఫోన్ ఈరోజే మార్కెట్లో లాంచ్ కానుంది.
Redmi 12:
రెడ్‌మి 12 స్మార్ట్‌ఫోన్ ఈరోజే లాంచ్ అయింది. ఇది బెస్ట్ బడ్జెట్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్. రూ. 15,000 విభాగంలో భారీ డిస్‌ప్లే, క్రిస్టల్ గ్లాస్ డిజైన్, సెంటర్ పంచ్ హోల్ నాచ్ డిజైన్తో వస్తుంది. ఇందులో 50MP కెమెరా, 128GB స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Samsung Galaxy F34:
శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో తీసుకురానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్34. ఈ స్మార్ట్‌ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, సూపర్ బ్యాటరీతో రానుంది. ఇప్పటికే స్పెసిఫికేషన్స్ గురించి శామ్‌సంగ్ హింట్ ఇచ్చింది. అయితే లాంచ్ డేట్, ధర ఎంతనే వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఆగస్టులోనే ఈ వేరియంట్ రిలీజ్ కానుంది.
Also Read: Moeen Ali Retirement: రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్.. ఈసారి మెసేజ్ డిలీటే!
Infinix GT 10 Pro:
ఇన్ఫినిక్స్ కొత్తగా రిలీజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ 10 సిరీస్. ఇది నథింగ్ ఫోన్ సిరీస్ ట్రాన్స్‌పరెంట్ ప్యానెల్‌తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ ఆగస్టు 3న లాంచ్ కానుంది. దీని ధర రూ. 20వేల రేంజ్‌లో ఉండవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌కు కంపాటబుల్‌గా ఉండనుందట.
iQOO Z7 Pro:
ఐక్యూ Z7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర దాదాపుగా రూ. 25000 వరకు ఉండవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్, డ్యుయల్ రియర్ కెమెరాలు, అమోలెడ్ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు చివరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Also Read: Delhi Air Quality: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. గత 4 సంవత్సరాలలో ఇదే మొదటిసారి!