తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్‌కు రానుంది.
భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది.
రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్ ప్లేయర్ పర్ణీత్ కౌర్ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన…
Hardik Pandya React on Team India Defeat against West Indies: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచులో భారత్ ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి…
West Bengal Minister Manoj Tiwary retires from all forms of cricket: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘క్రికెట్ ఆటకు వీడ్కోలు’ అని తివారీ తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆట తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఆద్యంతం తన పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మరియు…