INDvsPAK: బాబర్ ఎంత ట్రై చేసిన కోహ్లీ రికార్డ్ ను అందుకోలేడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. క్యాండీలోని పాలకల్లే గ్రౌండ్ లో రేపు (శనివారం) దాయాది దేశాల మధ్య పోరు జరుగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచి పాకిస్తాన్‌కు మరోసారి ఓటమి రుచి చూపించాలని భారత్ అనుకుంటుంటే.. పాకిస్తాన్ మాత్రం గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది.
Read Also: Nonstick Pans : నాన్ స్టిక్ ప్యాన్స్‌లో ఈ కూరలను అస్సలు వండకండి..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
టీ20 వరల్డ్ కప్ తర్వాత చిరకాల ప్రత్యర్థి జట్లు ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. ఇక ఇది ఇలా ఉండగా ఆసియాకప్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు మాత్రం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కోహ్లి తన పేరు మీద లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఏకంగా 183 రన్స్ చేసి రికార్ట్ సృష్టించాడు. తాజాగా ఆసియాకప్ ఆరంభ గేమ్ నేపాల్ తో పాక్ ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజం 151 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు.
Read Also: MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు..
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్(143), యూనిస్ ఖాన్(144), ముస్తిఫిజర్ రెహ్మాన్(144)లను బాబర్ ఆజం అధిగమించాడు. కానీ విరాట్ కోహ్లీ రికార్డును మాత్రం బాబర్ టచ్ కూడా చేయలేకపోయాడు. అయితే టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి విరట్ ఘనతను ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో అనేది వేచి చూడాలి.. కాగా, ఆసియాకప్ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 613 పరుగులతో పన్నెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నమెంట్లో కోహ్లీ మరో 358 రన్స్ చేస్తే.. ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండుల్కర్ (971) రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!