టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. వెస్టిండీస్‌తో వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే.. 2006 తర్వాత తొలిసారిగా సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.
Upcoming Smartphones in August 2023 Under Rs 20000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. 2023 ఆగస్టులో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్సంగ్, రెడ్మీ, మోటొరోలా, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ బట్టి స్మార్ట్ఫోన్లను కొనేసుకోవచ్చు. ఆగస్టులో రిలీజ్ అయ్యే స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి చూద్దాం.…
భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.
గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తాజా అప్డేట్ వచ్చింది. అతను బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు భారత క్రికెట్‌కు మంచి సంకేతాలు ఇస్తోంది.
తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందినదిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్, సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
బార్బడోస్ వేదికగా టీమిండియాతో జరుతున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని విండీస్ సారథి షాయీ హోప్ అంచనా వేశారు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇండియా, జపాన్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు. రెండు దేశాలు పరస్పర మిత్ర దేశాలని.. అన్ని రకాలుగా భాగస్వామ్య దేశాలుగా కొసాగుతాయని ప్రకటించాయి.