చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు.
దాదాపు 2 కోట్ల మంది తమ మొబైల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక లాభం లేదని.. హాట్ స్టార్, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.
INDIA vs NDA: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.
G20 Summit: వచ్చే నెలలో జరగబోతున్న జీ20 సమావేశాలకు భారత్ వేదిక కాబోతోంది. జీ20 దేశాధినేతలు ఇండియా రాబోతున్నారు. ఈ క్రమంలో వారిందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది.
China: డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయ సమీపంలోని పాంగాంగ్త్సో సరిస్సు వద్ద గలాటా సృష్టిస్తున్న చైనా ఇప్పుడు మరో కొత్త పన్నాగానికి తెర లేపింది.
Rohit Sharma Interview Goes Viral Ahead of Asia Cup 2023: ప్రపంచకప్ జట్టులో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. బాగా ఆడినా కూడా కొన్నిసార్లు జట్టులో చోటు దక్కదు. జట్టు కూర్పు కారణంగా ఇలా జరుగుతుంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2011 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎంతో బాధతో గదిలో కూర్చుని ఏడ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆనాటి చేదు జ్ఞాపకాలను…
India Playing 11 against Pakistan Match for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ 2023 మొదలుకానుంది. పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య పోరుతో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలెలో పాకిస్తాన్, భారత్ మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ తుది జట్టు ఎలా ఉండనుందనే…
భారత్‌లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు.
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య స్థాయిలో సంబంధాలపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. దానికి కారణమేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవ పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.