టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై పాక్ లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చైనా సంస్థల ప్రతినిధిగా మారారా అని రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆసియాకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కోహ్లి తన పేరు మీద లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఏకంగా 183 రన్స్ చేసి రికార్ట్ సృష్టించాడు. తాజాగా ఆసియాకప్ ఆరంభ గేమ్ నేపాల్ తో పాక్ ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజం 151 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు.
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది.
India-USA: భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది. చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఒకే చెప్పింది. దీంతో భారత వైమానికి దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజిన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమం అయింది