కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(15), సిరాజ్ (2) ఉన్నారు.
Read Also: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఎంతమంది చూశారో తెలుసా.. రికార్డ్ క్రియేట్..!
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. నిన్న సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ కేవలం పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ (39) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ అతి తక్కువ పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. భారత బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ(53), శుభ్ మన్ గిల్(19) పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిన్నటి సెంచరీ వీరుడు (3) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన యంగ్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కొద్దిసేపు క్రీజులో ఉండి పర్వాలేదనిపించాడు. (33) పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్(39), హార్ధిక్ పాండ్యా (5), రవీంద్ర జడేజా (4) పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వారంతా సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.
Read Also: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. తాజాగా ముగ్గురు మృతి
ఇక శ్రీలంక బౌలర్లలో యువ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. భారత్ స్కోరును కట్టడి చేయడంలో ఈ బౌలర్ కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. మరో బౌలర్ చరిత్ అసలంక కూడా 4 వికెట్లు తీశాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో జోరు కనిపించిన టీమిండియా బ్యాట్స్ మెన్లలో ఇవాళ అది కనిపించలేదు. అయితే వర్షం ఆగిపోయిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైతే.. భారత బౌలర్లు మంచి ప్రదర్శన చూపించాలి. లేదంటే లంకేయుల చేతిలో ఓటమిచెందిన వాళ్లవుతాం. చూడాలి మరి బౌలింగ్ లో కుల్దీప్ నిన్నటిలా.. అద్భుత ప్రదర్శన చూపిస్తాడా.. బుమ్రా పేస్ బౌలింగ్ తో శ్రీలంక బ్యాట్స్ మెన్లను ఎలా ఇబ్బందిపెడుతాడో చూడాలి.