Neeraj Chopra asks Pakistan’s Arshad Nadeem to join him for photo: టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం గెలిచి మరోసారి భారతదేశం గర్వపడేలా చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నీరజ్ ఈటెను 88.17 మీటర్లు విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి రజతం…
Neeraj Chopra Interview after Wins Gold Medal in World Athletics Championships 2023: గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈసారి స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.17 మీటర్లు విసిరిన నీరజ్.. పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 88.17 మీటర్లు విసిరగా.. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో…
బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలింది.
ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన బిజినెస్ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్న చోట మాత్రమే లాభదాయకమైన మార్కెట్ మనుగడ సాగిస్తుందని ప్రధాని అన్నారు. ఇతర దేశాలను మార్కెట్‌గా పరిగణించడం ఎప్పటికీ పనికిరాదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన టీమ్ లో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్-1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేయడంతో.. మళ్లీ నెంబర్-1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.
చంద్రునిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాకిస్థాన్ పౌరులే పాక్ అంతరిక్ష సంస్థను ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఆహార కొరత ఉందని, అంతరిక్షంలోకి వెళ్లడం గురించి ఎవరు మాట్లాడతారని ప్రజలు అంటున్నారు.