India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA’s First Coordination Panel Meet : అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీట్ల షేరింగ్ మీదే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఈగోలు లేకుండా ఐకమత్యంగా ముందుకు వెళితేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న నేతలు ఈసారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ముఖ్యమైన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది.
Also Read: Hyderabad: జహీరాబాద్‌లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ఇండియా కూటమిలో ఈ 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. మోడీ ముందస్తుకు వెళ్తారు అనే వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉంది ఇండియా కూటమి. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లే అని అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే కొంచెం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించే ప్లాన్లు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి చర్చిస్తామని కూడా కూటమి సభ్యుడు రాఘవ్ చద్దా సమావేశాలకు ముందు చెప్పారు. ఇండియా కూటమిలో కమిటీ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఈరోజు జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
STORY | Uddhav holds talks with Pawar in Mumbai ahead of INDIA coordination panel meeting
READ: https://t.co/7pjKDaOmHI pic.twitter.com/U3Wd80phe1
— Press Trust of India (@PTI_News) September 12, 2023
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!