Team India Batting Order confirmed with NCA Training Session Ahead of Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఆసియా కప్ 2023లో బరిలోకి దిగేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం బెంగళూరులోని ఆలూరులో టీమిండియా శిక్షణ శిబిరం ముమ్మరంగా కొనసాగుతోంది. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు కూడా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో…
ఇండియాలో యువత ఎక్కువ మంది ఉన్నారు. యువత ఎక్కువ మంది ఉన్న భారత దేశంలో పనిచేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. దేశంలో పనిచేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్‌బర్గ్‌లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది.
Suni Joshi and Gautam Gambhir Debate on India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు సెలెక్టర్లు ఛాన్స్…
UWW has suspended the membership of the WFI: ప్రపంచ వేదికపై భారత రెజ్లింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ప్రకటించింది. ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైన కారణంగా యూడబ్ల్యూడబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో డబ్ల్యుఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారతదేశం యొక్క రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన…
Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ…
Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25…