చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది.
ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు జీ20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.
ఆసియా కప్ 2023లో భాగంగా కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సూపర్- 4 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్‌లు పూర్తి చేశాడు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత అభిమానుల చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్ ద్వారా కింగ్ కోహ్లి తన పేరిట ఉన్న రికార్డును ప్రస్తుతం మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట నెలకొల్పాలని భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు పూర్తి చేస్తే ప్రపంచ రికార్డు సాధిస్తాడు.
ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని, కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని మేదినీపూర్ ఎంపీ అన్నారు.
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక…
ఆసియన్ కప్ 2023లో భాగంగా.. మరికాసేపట్లో భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్-4 మ్యాచ్ ప్రారంభంకానుంది. కొలంబోలో జరుగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
Pakistan: పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది.
Joe Biden: భారత్ జీ20 సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా కీలక వ్యక్తులు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఐఏతో పాటు భారతదేశ సెక్యూరిటీ విభాగం అడుగడుగున ప్రెసిడెంట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇంత సెక్యూరిటీ ఉండే బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రోటోకాల్‌ని ఉల్లంఘించారు. ఈ ఘటన శనివారం…