దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు.
జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్కు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీలో జీ20 సమ్మిట్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడారు. జీ20 సమ్మిట్ ముగింపులో న్యూఢిల్లీ నాయకుల ప్రకటన గ్లోబల్ సౌత్ స్వరాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో భాగంలో బెల్జియంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులను, ప్రవాసభారతీయులను, పలువురు వ్యాపారవేత్తలను ఆయన కలవనున్నారు. రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పెట్రోడా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. యూరప్ చివర్లో ఆయన నార్వేలో పర్యటించనున్నారు. ఓస్టోలో అక్కడి పార్లమెంటేరియన్ సభ్యులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
G20 Summit: పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా, భారత్ పావులు కదుపుతున్నాయి. రైల్, ఓడరేవుల మెగా డీల్పై అమెరికా, సౌదీ అరేబియా, భారత్, ఇతర దేశాలు చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ శుక్రవారం ప్రకటించింది. దీనిపై అమెరికన్ న్యూస్ లెటర్ ఆక్సియోస్ కథనాన్ని నివేదించింది.