G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. భారత్ ఇస్తున్న ఆతిథ్యానికి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ జీ20 నిర్వహిస్తుండటంపై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి భారతదేశంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా థింక్ ట్యాంక్ భారతదేశం తన సొంత ఎజెండాను ప్రచారం చేయడానికి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించడానికి జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటోందని ఆరోపించింది.
ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో నేడు ( ఆదివారం ) జరిగే సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ నెల 2న భారత్, పాక్ తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ్టి మ్యాచ్ కు ‘రిజర్వ్ డే’ను ప్రకటించారు.
జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్‌లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.
శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు.
జీ20 కూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. స్వాగతించారు. నేడు భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించగా.. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు.
దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది.