కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
ఆసియా కప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10 వేల పరుగుల మార్కును దాటాడు.
నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచి మంచి జోరు మీదున్న టీమిండియా.. శ్రీలంకతో ఆరంభంలో మంచి ప్రారంభాన్ని అందించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ గిల్(19) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం (3) పరుగులు చేసి ఔటయ్యాడు.
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడటంతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సిక్ ఫర్ జస్టిస్’ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారతీయ నాయకులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Kuldeep Yadav React on 5 Wicket Haul vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 357 పరుగుల లక్ష ఛేదనలో పాక్ 128 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ 8 ఓవర్లలో…
Khalisthan Group Warning to Bharat: కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది ఖలిస్థాన్ గ్రూప్. జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది. భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా…
Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023లో దాయాది పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ లంకపై…
India Playing 11 against Sri Lanka: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాదించిన భారత్.. 24 గంటలు కూడా గడవక ముందే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. అయితే భారత జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి…