Asian Games 2023: క్రికెట్‌లో మేం స్వర్ణం గెలిచాం.. ఇక మీ వంతు: జెమీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jemimah Rodrigues urges India Men’s Cricket Team to go for Gold Medal in Asian Games 2023: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. భారత యువ పేసర్ టిటాస్ సాధు 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది.
ఆసియా గేమ్స్ 2023లో జెమీమా రోడ్రిగ్స్ టాప్ స్కోరర్. మూడు మ్యాచుల్లో జెమీమా 109 పరుగులు చేసింది. ఫైనల్‌లో కీలక సమయంలో 42 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించేందుకు దోహదపడింది. గోల్డ్ మెడల్ అందుకున్న తర్వాత జెమీమా మాట్లాడుతూ భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం పంపింది. ‘ఇక మనం భారత పురుషుల క్రికెట్ జట్టు గురించి మాట్లాడుదాం. వారికి ఒకటే విజ్ఞప్తి.. మేం స్వర్ణం గెలిచాం, ఇక మీ వంతు. మీరు కూడా ఆసియా గేమ్స్ 2023లో గోల్డ్ మెడల్ సాదించాలి అని జెమీమా ‘కోరింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
Also Read: Manipur Violence: మణిపుర్‌లో ఘోరం.. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య! పిక్స్ వైరల్
‘పోడియంపై భారత జాతీయ జెండా ఎగరడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి అనుభూతి అద్భుతం. స్వర్ణ పతకం గెలవడం చాలా స్పెషల్. భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి గోల్డ్ మెడల్ సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. మేం కూడా ఒక మెడల్‌ను దేశం కోసం సాధించామని చెప్పుకుంటాం. ఆసియా క్రీడల్లో భారత జెర్సీని ధరించి బరిలోకి దిగడం ఓ భిన్న అనుభవం. ఫైనల్‌లో అందరూ బాగా ఆడారు’ అని జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని పురుషుల జట్టు అక్టోబర్ 3న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఆసియా గేమ్స్ 2023లో ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది.
Top run-scorer of the tournament Jemimah Rodrigues flaunting her Gold Medal 🏅😍#CricketTwitter #AsianGames2023 pic.twitter.com/S9wIQTgA2q
— Female Cricket (@imfemalecricket) September 25, 2023
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు