ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. తెలుగు వారు అందరూ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్.. ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం…
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర.. బీహార్‌లో 16 రోజుల పాటు సాగిన రాహుల్ యాత్ర.. మొత్తం 25 జిల్లాల్లో, 110 నియోజక వర్గాల్లో 1,300 కి.మీ మేర సాగిన యాత్ర.. నేడు పట్నాలో బహిరంగ సభతో ముగియనున్న రాహుల్ యాత్ర * పంజాబ్ కు మరో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్.. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ లో అత్యధిక వర్షపాతం.. ఉప్పొంగుతున్న సటుజ్, బియాస్, రవి నదులు..…
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది.