* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. ఇప్పటి వరకు టైటిల్ సాధించని భారత్, సౌతాఫ్రికా.. ప్రపంచకప్ టైటిల్ పై కన్నేసిన ఇరు జట్లు.. 2005, 2017లో ఫైనల్స్ లో ఓడిన భారత మహిళల జట్టు..
* నేడు ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు ఎస్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్న ఏసీఏ.. ఏసీఏ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్..
* నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20.. హోబర్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకి మ్యాచ్..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న మంత్రి..
* నేడు జూబ్లీహిల్స్ లో మరోసారి బీజేపీ మహా పాదయాత్ర.. 7 డివిజన్లలోని 50 ప్రాంతాల్లో పాదయాత్ర.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహా పాదయాత్ర..
* నేడు జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షో.. మాగంటి సునీత తరపున కేటీఆర్ ప్రచారం..
* నేడు మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. రెండో రోజూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల కూల్చివేత పనులు..
* నేడు శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ బృందం.. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న బొత్స..
* నేడు భక్తి టీవీ ఆధ్వర్యంలో రెండో రోజు కోటి దిపోత్సవం.. కార్తీక ఆదివారం – క్షీరాబ్దిద్వాదశి) విశేష కార్యక్రమాలు.. పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ, శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీల అనుగ్రహ భాషణం.. శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రవచనామృతం.. వేదికపై శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన, తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజ.. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణం.. చివరిగా కల్పవృక్ష వాహన సేవ..
* నేడు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం.. కొండ దిగువ పంపా సరోవరంలో రాత్రి 7గంటలకు హాంస వాహనంపై విహరించునున్న సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవారు.. సాయంత్రం 5గంటలకు తులసి ధాత్రి పూజ
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం..
* నేడు సాయంత్రం 5.26 గంటలకి శ్రీహరికోటలోని షార్ నుంచి LVM3 రాకెట్ ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో..
* నేడు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. హరిద్వార్ లోని పతంజలి యూనివర్సిటీలో రెండో స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము..