* నేడు వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే.. వరంగల్, హుస్నాబాద్ లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే.. మధ్యాహ్నం 2గంటలకు హనుమకొండలో ల్యాండింగ్.. సమ్మయ్యనగర్, కాపువాడ ముంపు ప్రాంతాలు పరిశీలన.. అనంతరం కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి సమీక్ష..
* నేటి నుంచి జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షోలు.. ఈరోజు షేక్ పేటలో కేటీఆర్ రోడ్ షో.. నవంబర్ 1న రహమత్ నగర్ లో, నవంబర్ 2న యూసఫ్ గూడ, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్..
* నేడు పీపుల్స్ ప్లాజాలో హైదరాబాద్ సిటీ పోలీసుల ఏక్తా రన్.. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ఏక్తా రన్ లో పాల్గొననున్న తెలంగాణ డీజీపీ శివశంకర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్..
* నేడు మధ్యాహ్నం 3గంటలకి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబు..
* నేడు గుంటూరులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న పెమ్మసాని..
* నేడు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం..
* నేడు గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొననున్న మోడీ..
* నేడు ప్రొకబడ్డీ ఫైనల్ మ్యాచ్.. ఫైనల్ లో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పుణెరి పల్టాన్.. రాత్రి 8గంటలకి మ్యాచ్ ప్రారంభం..
* నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20.. మెల్ బోర్న్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే వర్షం కారణంగా తొలి మ్యాచ్ టీ20 రద్దు..