భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు డర్బన్‌లోని కింగ్స్మీడ్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్యాచ్ లు సెయింట్ జార్జ్ పార్క్, న్యూ వాండరర్స్ స్టేడియాల్లో జరగనున్నాయి.
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ…
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
Onion Exports: దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను అదుపులో ఉంచడంతో పాటు, సామాన్యులకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ఎగుమతులపై వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘‘ఉల్లిపాయల ఎగుమతి విధానం.. మార్చి 31, 2024 వరకు నిషేధించబడింది’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) నోటిఫికేషన్లో తెలిపింది.
ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది.
India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికన్ పౌరుడైన పన్నూని హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, అతనికి ఓ భారత ప్రభుత్వ ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయని అమెరికా న్యాయశాఖ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. అయితే అమెరికన్ పౌరుడిని, అమెరికన్ గడ్డపై హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం…
India: పాకిస్తాన్లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
Deepak Chahar Set To Miss India Tour Of South Africa: భారత పేసర్ దీపక్ చహర్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తండ్రి లోకేంద్ర సింగ్ కోలుకునే వరకు ఆయన వెంటే ఉంటానని దీపక్ తాజాగా వెల్లడించాడు. ఇదే విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు బీసీసీఐ సెలెక్టర్లకు తెలియజేసినట్లు చెప్పాడు. తనని క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తండ్రిని ఈ స్థితిలో వదిలి వెళ్లలేని దీపక్ స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ…
Shubman Gill snapped with Avneet Kaur in London: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ విశ్రాంతి తీసుకున్నాడు. మెగా టోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడని గిల్.. ఇటీవల లండన్‌కు వెళ్లాడు. అక్కడి వీధుల్లో స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టాడు. అయితే గిల్ పక్కన బాలీవుడ్ హాట్ నటి అవనీత్ కౌర్ ఉండడం విశేషం. గిల్, అవనీత్ లండన్‌లో దిగిన ఫోటోలు ప్రస్తుతం…