General elections: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ‘ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను తీసుకువచ్చింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ప్రపంచంలోనే తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ మొదటిస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. నివేదిక జనవరి ప్రారంభంలో దాని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ మరియు గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే యొక్క 19వ ఎడిషన్‌తో వచ్చింది.
Read Also: Priyanka Jain: బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా.. ఏడుస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్
34 ఆర్థిక, పర్యావరణ, భౌగోళిక రాజకీయ, సామాజిక మరియు సాంకేతిక ప్రమాదాల ర్యాంకింగ్ ఆధారంగా రాబోయే రెండేళ్లలో పలు దేశాల్లో పరిస్థితులను విశ్లేషించి రేటింగ్ ఇచ్చింది. భారత్ మాత్రమే కాకుండా అమెరికాతో పాటు పలు దేశాలు 2024లో ఎన్నిలకు వెళ్తున్నాయి. తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో అమెరికా 6వ స్థానంలో, యూరోపియన్ యూనియన్ 8వ స్థానంలో, యూకే, మెక్సికో దేశాలు 11వ స్థానంలో, దక్షిణాఫ్రికా 22వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు 2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్పుడు సమాచారంగా నిర్వచించింది. రాబోయే రెండేళ్లలో అమెరికా, ఇండియా, యూకే, మెక్సికో, ఇండోనేషియాతో సహా అనేక ఆర్థిక వ్యవస్థల్లోని దాదాపు 3 బిలియన్ల మంది ప్రజలు ఎన్నికలకు వెళ్తున్నారు.