గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్‌కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు. కవాతులో రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ A330 మల్టీ-రోల్ ట్యాంకర్ విమానాలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల మార్చింగ్ స్క్వాడ్ తో పాటు 33 మంది సభ్యుల బ్యాండ్ స్క్వాడ్ కవాతులో పాల్గొననుంది.
Read Alo: Anupama Parameswaran: వంపు సొంపులతో వయ్యారాలు వలకబోస్తున్న అనుపమ పరమేశ్వరన్…
ఇక, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (జనవరి 25న) జైపూర్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమెర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్‌లను అధ్యక్షుడు మాక్రాన్ సందర్శిస్తారు. జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలవనున్నారు. దీని తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ అర్థరాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌కు అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ఇచ్చే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌లో పాల్గొంటారు.
Read Alo: IND v ENG: భారత్‌కు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానం.. అశ్విన్‌కు తిరుగేలేదు!
అయితే, రాబోయే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని అతిథిగా రావాలని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ, బైడెన్ నిరాకరించడంతో చివరి క్షణంలో ఫ్యాన్స్ అధ్యక్షుడి కార్యాలయంతో చర్చలు జరిగాయి.. ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను చూసిన మాక్రాన్ ఈ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఆరు నెలల్లో ఆరోసారి ప్రధాని మోడీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య సమావేశం జరగనుంది. భారతదేశం యొక్క మొదటి వ్యూహాత్మక భాగస్వామి దేశం ఫ్రాన్స్.